- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'OG' Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘ఓజీ’ ఫుల్ HD ప్రింట్ లీక్!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం విడుదల అయిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన చిత్రం ('OG' Movie) ఓజీ విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షో తో పాజిటివ్ టాక్ రావడంతో ఇవాళ థియేటర్లు కిక్కిరిసిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సిస్‌లో కూడా ఓజీ సినిమా హవా కొనసాగుతోంది. అయితే సినిమా టికెట్ల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతుంటే.. ఇవాళ విడుదల అయిన ఓజీ సినిమాకు పైరసీ దెబ్బ పడినట్లు తెలుస్తోంది.
సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఇంటర్నెట్‌లో ప్రింట్ లీక్ అయినట్లు తెలిసింది. టెలిగ్రామ్, పలు పాపులర్ వెబ్‌సైట్లలో ఫుల్ HD ప్రింట్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పైరసీ చేసిన వారిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాజిటివ్ టాక్ ఉన్న సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష మవ్వడంపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కలెక్షన్లు దెబ్బ తింటాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల ఏ సినిమా విడుదల అయిన గంటల్లోనే ఆన్‌లైన్‌లో దర్శనమిస్తోంది. దీంతో సినిమా నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.






