- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డు క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్ OG సినిమా కలెక్షన్స్.. అధికారిక ప్రకటన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం(OG Movie) రికార్డు క్రియేట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం(OG Movie) రికార్డు క్రియేట్ చేసింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి వచ్చి రికార్డులు తిరగరాసిన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను ఓజీ మించిపోయిందని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.303 కోట్లు వస్తే.. పవన్ కల్యాణ్ ఓజీకి అంతకుమించి వచ్చాయని పేర్కొన్నారు. అయితే.. అధికారిక కలెక్షన్ పోస్టర్ విడుదల చేయకపోవడం గమనార్హం.
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య(DVV Danayya), కల్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రల్లో మెరిశారు. ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. 3 రోజుల్లో 200 కోట్ల క్లబ్‌లో చేరగా.. 4 రోజుల్లో రూ.252 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా పోస్టర్లు వదిలారు. ఆ తర్వాత అధికారికంగా కలెక్షన్లపై ఎలాంటి పోస్టర్స్ విడుదల చేయలేదు. చివరగా ఇవాళ 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచిందని అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్






