OG: అప్పుడే ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’.

OG: అప్పుడే ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. రిలీజ్‌కు ముందు ఇందులో నుంచి వచ్చిన ఎన్నో అప్డేట్స్ ఆకట్టుకోగా.. సినిమాపై భారీ అంచనాల క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా.. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రాగా.. పవన్ కల్యాణ్ స్వాగ్‌కు పలువురి ప్రశంసలు కూడా అందాయి. అలాగే రీసెంట్‌గా నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేయడంతో మరింత క్రేజ్ పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలై ఎన్నో డేస్ కాకుండానే ఓటీటీ రిలీజ్‌పై షాకింగ్ న్యూస్ వైరల్ అవుతున్నది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Next Story