సల్మాన్ సినిమా కంటే.. పవన్ కళ్యాణ్ సినిమా బెస్ట్: వైరలవుతున్న స్టార్ హీరోయిన్ పోస్ట్

by I. Sairam |   (  Updated:2026-02-01 06:43:37  IST  )

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

సల్మాన్ సినిమా కంటే.. పవన్ కళ్యాణ్ సినిమా బెస్ట్: వైరలవుతున్న స్టార్ హీరోయిన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మ‌ధ్య ర‌కుల్‌కి టాలీవుడ్‌లో అవ‌కాశాలు కరువ‌య్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో(2013లో) రకుల్ పెట్టిన పోస్ట్ఇప్పుడు వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ట్వీట్‌లో ఈ చిన్నది.. ‘ఒక పంజాబిని అయిన నాకు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా కంటే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ మూవీ నచ్చింది.. పవన్ కళ్యాణ్ నిజంగా రాక్ స్టార్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ ట్వీట్‌ను ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరి మీరు కూడా గతంలో ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్‌ను చూసేయండి.

Next Story