- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harihara Veeramallu: అప్పుడే ఓటీటీలోకి రాబోతోన్న ‘హరిహర వీరమల్లు’.. నిరుత్సాహంలో ఫ్యాన్స్
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించినంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించినంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. కొంత వరకు బాగానే ఉందంటూ ప్రచారం జరిగిన.. డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే రిలీజైన వారం రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
‘హరిహర వీరమల్లు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్ట్రీమింగ్‌కు రానుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.. ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కాగా.. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూవీ, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. లింక్






