- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. మరో విశ్వం అంటూ పోస్ట్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Jonny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Jonny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు(Divorce) తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది.
అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం యాడ్స్ షూట్స్‌లో పాల్గొంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ గుడ్ హార్ట్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
రీసెంట్‌గా తన కూతురు ఆద్య పేరు మీద ఓ యానిమల్ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి మూగ జీవాలకు సహాయం చేస్తున్నది. ఈ క్రమంలో ఈ భామ ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటో పెట్టింది. అందులో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన ఫొటోలతో పాటు అక్కడి పిక్స్‌ను షేర్ చేస్తూ.. ఇది మరొక యూనివర్స్ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






