- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: బర్త్ డే ట్రీట్.. మైకల్ జాక్సన్ స్టైల్‌లో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది

దిశ, సినిమా: పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. రేపు పవన్ కల్యాణ్ బర్త్‌డే ఉండగా.. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయంటూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బర్త్‌డే స్పెషల్‌గా కాకుండా.. ముందే అడ్వాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవర్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘స్టైల్, స్వాగ్ అండ్ బాక్సాఫీస్ యొక్క పవర్ స్టార్ USTAAD పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ పోస్టర్ ఉస్తాద్ భగత్‌సింగ్ అభిమానులకు విందుగా.. ప్రేక్షకులకు ఆనందంగా ఉంటుంది’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ మైకల్ జాక్సన్ స్టైల్లో కనిపించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. కాగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.






