- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి BIG అప్డేట్.. పోస్టర్‌తోనే హైప్ పెంచేశారుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా పేరు తెచ్చుకున్న పవన్.. నిర్మాతలను సైతం దృష్టిలో ఉంచుకొని.. ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టులను చకచకా ఫినిష్ చేసేస్తున్నారు. పవన్ నటిస్తున్న చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Usthad Bhagat Singh) ఒకటి. దీనికి హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఎవరి చేతిలో చేయి వేసి పట్టుకున్నాడు. కానీ వీరి ఫేస్‌లను మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది






