డిఫరెంట్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-12 03:30:16  IST  )

‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

డిఫరెంట్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ..  గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లలేకపోయింది. దీంతో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా నటించిన మూవీల్లో ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi) సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఈ చిత్రంలో సమంత మెయిన్ రోల్ ప్లే చేసింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఒక పాప, బాబు ఉన్నారు. అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ నెట్టింట హాట్ షోతో ఫాలోవర్స్‌కు హీట్ పెంచుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో షార్ట్ ఫ్రాక్ వేసుకుంది. అయితే అది అచ్చం దారాలతో మాత్రమే చేసినట్టు కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story