- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లై ఇద్దరు పిల్లలున్నా సో హాట్ అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సి పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సి పనిలేదు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Yem Pillo Yem Pillado) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి.. ఆ తర్వాత ‘బావ’(Bava) మూవీతో బాగా ఫేమస్ అయింది. దీంతో ఈ బుట్టబొమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకున్నా స్టార్ డమ్ అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా ‘రభస’(Rabhasa), ‘హలో గురు ప్రేమ కోసమే’(Hello Guru Prema Kosame), ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi) వంటి చిత్రాల్లో నటించింది. ఇక పవన్ కళ్యాణ్(Pawan KAlyan) నటించిన అత్తారింటికి దారేది మూవీతో సమంత(Samantha) కంటే ఎక్కువ ఫేమ్ సంపాదించుకున్నది. ‘బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది’ అనే పాటతో మస్తు ఫేమస్ అయింది.
దీంతో ఈ భామ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీగా అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిన్నది కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే మ్యారేజ్ తర్వాత ఒక పాప పుట్టిన ఈ చిన్నదానికి రీసెంట్‌గా ఒక బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం వారి బాగోగులు చూస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం లేటెస్ట్, ట్రెడిషనల్, ట్రెండీ వేర్ అవుట్ ఫిట్‌లో సూపర్బ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత శుభాష్ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ లెహంగాలో నడుము, నావెల్ పార్ట్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా హాట్‌నెస్ విషయంలో తగ్గేదేలే అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అమ్మడు గ్లామరస్ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.






