- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు, రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కృతజ్ఞతలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణమని కొనియాడారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, డీజీపీ జితేందర్‌కి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌కి, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భారీ వర్షం కురుస్తున్నా ఈ వేడుకలో ఎనలేని ఉత్సాహంతో అసంఖ్యాకంగా అభిమానులు పాల్గొన్నారు. వారు చూపిస్తున్న అభిమానం, ఉత్సాహం మరువలేనిది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకున్న శ్రేయాస్ మీడియా సంస్థకు, బందోబస్తు చేపట్టిన పోలీసు సిబ్బందికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా యాజమాన్యాలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకర్లకు కృతజ్ఞతలు. ‘ఓజీ’ చిత్ర రూపకల్పనలో ఎంతో తపించి పని చేసిన దర్శకుడు సుజిత్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, కళ్యాణ్ దాసరి, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.






