ఫ్యూచర్‌లో సినిమాలు చేయను.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌తో షాక్‌లో ఫ్యాన్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-22 16:23:50  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తను గతంలో పెండింగ్‌లో పెట్టిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకోగా.

ఫ్యూచర్‌లో సినిమాలు చేయను.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌తో షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తను గతంలో పెండింగ్‌లో పెట్టిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకోగా.. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక రీసెంట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే రీసెంట్‌గా ఓ మీడియాతో ముచ్చటించిన ఈయన సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఓజీ ఫిలిమ్ ఫినిష్ అయిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒక ఐదు, ఆరు రోజులు చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పుకుంటాను’ అని తెలిపారు. దాంతో క్లోజ్ అంటారా ఇక అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘అంటే నాకు భవిష్యత్తులో క్లాష్ ఉంటే నేను కచ్చితంగా సినిమాలు చేయను. పారిపాలన, జనసేనా పార్టీని అభివృద్ధి చేయడం నా ప్రయారిటీ. అదే నాకు బలం. కాకపోతే ఏంటీ అంటే సినిమా అనేది ఫినాన్షియల్‌గా అవసరం. అది ప్రొడ్యూస్ చేస్తానా.. లేక నటిస్తానా అనేది ఆ టైమ్ బట్టి ఉంటుంది. అయితే.. ప్రస్తుతం నా చేతిలో వేరే కథలు లేవు’ అంటూ చెప్పుకొచ్చారు పవర్ కల్యాణ్. వీడియో

Next Story