కోట్లు ఆఫర్ చేసినా టొబాకో యాడ్ తిరస్కరించిన పవర్ స్టార్

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-27 12:14:30  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో.. తన అభిమానులు, ఫాలోవర్స్‌కు ఎప్పుడూ ఓ మోటివేషనల్ పర్సన్‌గానే ఉంటాడు.

కోట్లు ఆఫర్ చేసినా టొబాకో యాడ్ తిరస్కరించిన పవర్ స్టార్
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో.. తన అభిమానులు, ఫాలోవర్స్‌కు ఎప్పుడూ ఓ మోటివేషనల్ పర్సన్‌గానే ఉంటాడు. తను తప్పు చేస్తే పది మంది తప్పు చేస్తారనే ఉద్దేశంతో.. ఆయన తీసుకోబోయే నిర్ణయాలపై కూడా ఒకటకి వందసార్లు ఆలోచిస్తాడు. ఈ క్రమంలోనే ఓ టొబాకో యాడ్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ రూ. 40కోట్లు ఇచ్చేందుకు రెడీ అయినా.. సింపుల్‌గా తిరస్కరించాడని సమాచారం. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రశంసల వర్షం కురుస్తోంది. మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

READ MORE ....

పూనకాలు లోడింగ్.. డబ్బింగ్ మైక్ పట్టుకోనున్న ఉస్తాద్

Next Story