- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ OG ఆల్‌టైమ్ రికార్డ్
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ సినిమా(OG Movie) విడుదలకు ముందే రికార్డు సరికొత్త క్రియేట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ సినిమా(OG Movie) విడుదలకు ముందే రికార్డు సరికొత్త క్రియేట్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 366కు పైగా ప్రీమియర్ షోలతో విడుదల అవుతున్న చిత్రంగా నిలిచింది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చిత్రవర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఆల్‌టైమ్ రికార్డ్ అని చిత్రబృందం అధికారంగా ప్రకటించింది. పోస్టర్ సైతం విడుదల చేసింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’. సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌లు షోలు పడనున్నాయి. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. ట్వీట్






