- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toli prema : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. కల్ట్ మూవీ రీరిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో ‘తొలిప్రేమ’కు(Tholi Prema) సపరేట్ బేస్ ఉంటుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డులు తిరగరాసింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో ‘తొలిప్రేమ’కు(Tholi Prema) సపరేట్ బేస్ ఉంటుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. పవన్ కల్యాణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడాదిపైగా థియేటర్లలో ఆడింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్నది. తాజాగా ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి మేకర్లు సిద్ధమయ్యారు. వచ్చే జూన్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 జులై 24వ తేదీన విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది.
కాగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ (Re Release)సినిమాల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు మరోసారి వెండి తెరపై విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాలను తిరిగి థియేటర్లో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. జూన్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా మూవీ విడుదల కాగా, జులైలో పవన్ కల్యాణ్ తొలిప్రేమను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






