- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi). జ్యోతి కృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. హరిహర వీరమల్లు బిగ్ స్క్రీన్‌కి రాకముందే మే 21న ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ఇది వరకే మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్టార్ అయిన ఈ ఈవెంట్‌కి ఏకంగా ముగ్గురు యాంకర్లు ఉండటం అనేది విశేషం. అది కూడా తెలుగు, తమిళ, హిందీ భాషా యాంకర్లు కావడం గమనార్హం. ఇక ఒకే వేదిక మీద ముగ్గురు యాంకర్ల సమక్షంలో ఈ ఈవెంట్ జరగడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చాలా అరుదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






