- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Valentine's Day Special: పవన్ కల్యాణ్.. మహేష్ బాబుల ప్యూర్ లవ్ మ్యాజిక్ (వీడియో)
ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) లవర్స్ అంతా గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. గిఫ్టులు ఇస్తూ ఇష్టమైన వారికి ప్రియమైన క్షణాలను అందిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) లవర్స్ అంతా గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. గిఫ్టులు ఇస్తూ ఇష్టమైన వారికి ప్రియమైన క్షణాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో వచ్చిన క్యూటెస్ట్ లవ్ స్టోరీస్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రెండు సినిమాల క్లిప్స్‌ను ఫ్యాన్స్ పోటా పోటీగా షేర్ చేస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని లవ్ సీన్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఖుషీ మూవీ(Kushi Movie)కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారనడంలో సందేహం లేదు. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నెలల తరబడి ఆడటంతో పాటు నిర్మాతలకు భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా తెచ్చిపెట్టింది. పవన్ కల్యాణ్ కెరియర్‌లో మైలురాయి చిత్రంగా నిలించింది. భూమిక కథానాయికగా నటించగా.. శివాజీ, అజయ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని పాటలు కూడా కొన్ని సంవత్సరాలు పాటు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఇవే వినిపించేవి.
ఇక మహేష్ బాబు(Mahesh Babu)- విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా(Seethamma Vakitlo Sirimalle Chettu) కూడా బాగానే ఆడింది. ఒక వర్గం ఆడియెన్స్‌ను ఈ చిత్రం తనవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్, సమంతల మధ్య ఉండే లవ్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఎలాంటి హంగు హడావిడిలు లేకుండా.. ప్యూర్‌గా తెరకెక్కించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇక ఈ మూవీ ఫైనాన్షియల్‌గా ఊహించుకున్నంత రేంజ్‌లో రాబట్టకపోయినా.. పర్లేదు అనిపించేలా కలెక్షన్స్ వచ్చాయి.






