- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ సంచలన ట్వీట్
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘బంగారం’(Bangaram) అనే సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించిన బ్యూటీ మీరా చోప్రా(Meera Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘బంగారం’(Bangaram) అనే సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించిన బ్యూటీ మీరా చోప్రా(Meera Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కానీ ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ ట్వీట్(Tweet) నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మీరా చోప్రా ఎక్స్(X) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ‘పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు. కేవలం గట్స్ మాత్రమే కాదు.. తెలివి, బుద్ధి, జ్ఞానం ఉన్న నాయకుడు’ అంటూ తెగ పొగిడేసింది. ప్రస్తుతం మీరా చోప్రా ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎంతగా వైరలయ్యాయో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా త్రిభాషా విధానంపై పవన్ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హిందీ భాషను అడ్డుకుంటున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
రూపీ సింబల్‌ను సైతం రద్దు చేసి కొత్తది ప్రవేశ పెట్టుకున్న స్టాలిన్ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేశాడు. ‘హిందీ భాష మాత్రం వద్దు.. తమిళ సినిమాలు మాత్రం హిందీలో డబ్ చేస్తారు.. అక్కడి డబ్బులు మాత్రం మీకు కావాలి.. అక్కడి భాష మాత్రం మీకు వద్దా?’ అంటూ తమిళ నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే డీలిమిటేషన్ విధానం గురించి పవన్ మాట్లాడిన తీరు పై భిన్న రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలామంది పవన్ తీరును మెచ్చుకుంటుంటే ప్రకాష్ రాజ్(Prakash Raj) లాంటి మరికొందరు మాత్రం పవర్ స్టార్ కామెంట్స్‌ను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో మీరా చోప్రా ఇలా ట్వీట్ చేయడం మరింత వైరల్‌గా మారింది.






