రజినీకాంత్ కూలీ మూవీలో పవన్ కల్యాణ్.. హోరెత్తిన థియేటర్!

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-14 08:45:38  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం(Coolie Movie) ఇవాళ గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది.

రజినీకాంత్ కూలీ మూవీలో పవన్ కల్యాణ్.. హోరెత్తిన థియేటర్!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం(Coolie Movie) ఇవాళ గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రానికి నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. రజినీకాంత్ అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. లియో, ఖైదీ, విక్రమ్, మాస్టర్ చిత్రాలు తీసిన లోకేష్ కనగరాజ్ తన మార్క్ మిస్ అయ్యాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ మాత్రం థియేటర్ దద్దరిల్లేలా చేసిందని అభిమానులు చెబుతున్నారు. సినిమాలో రజినీకాంత్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్లను ప్రస్తావిస్తారని.. ఆ సమయంలో థియేటర్ మొత్తం హోరెత్తిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మళయాలం నటుడు శోభున్ షాహిర్, శ్రృతీ హాసన్ కీలక పాత్రల్లో నటించారు.

Also Read..

WAR 2 : ఎన్టీఆర్‌కు రక్త తిలకం దిద్దిన అభిమానులు.. వీడియో వైరల్

Next Story