పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-11 12:41:39  IST  )

పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్

పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ(Ustad Bhagat Singh Movie) నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్‌ ప్రోమోను చిత్రబృందం విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సాంగ్‌ రికార్డింగ్ సమయంలో స్టూడియోలో నెలకొన్న సందడికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సింగర్ విశాల్‌ దడ్లాని ఉన్నారు. ఈ వీడియో ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను పెంచింది. పూర్తి పాటను డిసెంబర్ 13న వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. ‘గబ్బర్‌ సింగ్‌’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పవన్‌ కల్యాణ్ - డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. అందుకే ఫ్యాన్స్ చార్ట్ బస్టర్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ట్వీట్

Next Story