- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలా నిలబడితే నగ్నంగా ఉన్నట్టు ఉంది.. ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో.. హీరో రంగంలోకి దిగాడు. ప్రెస్‌మీట్‌తో అభిమానులు, సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని పెంచాడు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. స్పెషల్‌గా డైరెక్టర్ క్రిష్‌కు థాంక్స్ చెప్పాడు.

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో.. హీరో రంగంలోకి దిగాడు. ప్రెస్‌మీట్‌తో అభిమానులు, సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని పెంచాడు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. స్పెషల్‌గా డైరెక్టర్ క్రిష్‌కు థాంక్స్ చెప్పాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్స్ చేస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించాడు. తనను చూస్తుంటే సిగ్గేస్తుందని.. సినిమాను ఆమె భుజాలపైనే వదిలేశామేమోనని ఇలా ప్రెస్ మీట్ పెట్టామని తెలిపాడు. ఈ విధంగా నిర్మాత ఏఎం రత్నంకు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఈ క్రమంలో పవర్ స్టార్ చేసిన కొన్ని కామెంట్స్ స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేశాయి. ప్రెస్ మీట్ స్టార్టింగ్‌కు ముందు డిప్యూటీ సీఎం హోదాలో సెక్యూరిటీ అందుకున్న పవన్.. ఫస్ట్ టైమ్ సినిమా గురించి మీడియాతో ఇంటరాక్ట్ అవుతుండటం కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు. పోడియం లేకుండా మాట్లాడుతుంటే నగ్నంగా ఉన్నట్లుందని అన్నాడు. ‘సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. సినిమాను ఇలా చేశాం..అలా చేశాం.. అని చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను యాక్సిడెంటల్ యాక్టర్. గత్యంతరం లేని పరిస్థితుల్లో టెక్నిషియన్‌గా మారా’ అని చెప్పుకొచ్చాడు.






