- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
158కు క్లాప్ కొట్టిన కల్యాణ్ బాబు.. ఎమోషనల్ ట్వీట్ షేర్ చేసిన చిరు
మెగా-158 మూవీ ముహూర్తపు షాట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా.. ఆ ఫొటోను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

దిశ, సినిమా: మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా-158’ పూజా కార్యక్రమాలు నేడు (మే 21న) హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై అనౌన్స్‌మెంట్ నుంచో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు.
ఇక ముహూర్తపు షాట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా.. ఆ ఫొటోను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘ఈ రోజు కల్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే... 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ’ అంటూ ఫొటోలు పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా, ఒక కీలక పాత్రలో నటించబోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కూడా ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






