ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీకి బ్రేక్‌..ఆ కొత్త హీరోతో లోకేష్ భారీ ప్లాన్ ?

by velandi.Saikiran |

పవన్ కళ్యాణ్ తో లోకేష్ సినిమా చేయాలని ముందుగా కథ సిద్ధం చేసుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పండుగ పవన్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీకి బ్రేక్‌..ఆ కొత్త హీరోతో లోకేష్ భారీ ప్లాన్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో వస్తోంది. అయితే ఈ మూవీ లైన్ లో ఉండగానే అల్లు అర్జున్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది. అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ సినిమా చేసేందుకు స్కెచ్ వేశారట. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా రానున్నట్లు టాక్ నడుస్తోంది.

ముందుగా పవన్ కళ్యాణ్ తో లోకేష్ సినిమా చేయాలని ముందుగా కథ సిద్ధం చేసుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పండుగ పవన్ కళ్యాణ్ - లోకేష్ మూవీ ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్థానంలో అల్లు అర్జున్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడట లోకేష్ కనగరాజ్. ఈ మేరకు కథ కూడా అల్లు అర్జున్ కు చెప్పినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అల్లు అర్జున్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా వస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్నారు.

Next Story