పేట్రియాట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన మూవీ టీమ్

by I. Sairam |

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’.

పేట్రియాట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’. అయితే పదిహేడేళ్ల తర్వాత వీరి కాంబో తెరపైకి రానుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పుష్ప మూవీ ఫేమ్ ఫహాద్ ఫాజిల్, నయనతార కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న నటుల ఫస్ట్ లుక్స్ విడుదల చేయగా.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘“ఈ గణతంత్ర దినోత్సవం రోజున నిర్భయ స్వరాల స్ఫూర్తిని ఆవిష్కరించడం”.. ఏప్రిల్ 23, 2026న ప్రపంచవ్యాప్తంగా పేట్రియాట్ మూవీ వస్తుంది.. కౌంట్‌డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రైల్వే ట్రాక్‌పై మోహన్ లాల్, ఫహాద్ ఫజిల్, నయనతారతో పాటు మరో ఇద్దరు యాక్టర్స్ నిలబడి ఉండగా.. ముమ్ముట్టి గేమ్ చేంజర్‌లో వెనక బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తున్నాడు.

Next Story