- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్..సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్?
సంక్రాంతికి వరుసగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, తెలుగు వెర్షన్ పరాశక్తికి థియేటర్లు దొరకడం లేదట. దీంతో తెలుగు వెర్షన్ వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి అరడజన్ కు పైగా సినిమాలు సంక్రాంతి కానుకగా వస్తున్నాయి. ఇందులో ఐదు తెలుగు బడా హీరోల సినిమాలే ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సంక్రాంతి బరి నుంచి ఓ పెద్ద సినిమాను తప్పుకోనున్నట్లు టాక్ నడుస్తుంది. ఆ సినిమానే పరాశక్తి. జనవరి 10వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ ఈ సంక్రాంతికి వరుసగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, తెలుగు వెర్షన్ పరాశక్తికి థియేటర్లు దొరకడం లేదట. దీంతో తెలుగు వెర్షన్ వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు రేపు అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటికే విజయ్ నటించిన జన నాయకుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరాశక్తి మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట. అటు ఈ సంక్రాంతికి తెలుగులో రాజా సాబ్, చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి.
శ్రీ లీల, శివ కార్తికేయన్ జంటగా పరాశక్తి
శివ కార్తికేయన్, శ్రీ లీల జంటగా వస్తున్న సినిమానే పరాశక్తి. 1960 సంవత్సరంలో హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందట. ఈ మూవీలో జయం రవితో పాటు రానా కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆకాశమే నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.






