Paradha Teaser: అనుపమ ‘పరదా’ టీజర్ రిలీజ్.. ఎమోషనల్ సీన్స్‌తో అదిరిపోయిందిగా..!

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-03 09:20:59  IST  )

‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. ప్రస్తుతం మెయిన్ లీడ్‌లో ‘పరదా’(Paradha) అనే చిత్రంలో నటిస్తోంది.

Paradha Teaser: అనుపమ ‘పరదా’ టీజర్ రిలీజ్.. ఎమోషనల్ సీన్స్‌తో అదిరిపోయిందిగా..!
X

దిశ, సినిమా: ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. ప్రస్తుతం మెయిన్ లీడ్‌లో ‘పరదా’(Paradha) అనే చిత్రంలో నటిస్తోంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులో మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సీనియర్ నటి సంగీత(Sangeetha) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తోంది.

ఇక ఈ టీజర్‌ను గమనించినట్లయితే.. ఓ గ్రామంలో అమ్మాయిలు చున్నీతో ఫేస్ కవర్ చేసుకుంటారని, ఆ ఊరి నుంచి సుబ్బు అనే అమ్మాయి(అనుపమ) బయటకు రావడం, ఇంకో ఇద్దరు మహిళలను కలవడం, వారితో ట్రావెలింగ్, అంతలో ఊర్లో కట్టుబాట్లు, ఊరి సమస్య, మళ్ళీ ఊరికి తిరిగి వెళ్తుందా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఫైనల్‌గా ఎమోషనల్‌గా సాగిన ఈ టీజర్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాని తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Video Link..

Next Story