- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
బాలీవుడ్ నటుడు పంకజ్ ధీర్(63) మృతి సినీ ఇండస్ట్రీని దు:ఖసాగరంలో ముంచెత్తింది. ముఖ్యంగా మహాభారతం టీవీ సీరియల్‌లో ఐకానిక్ కర్ణ పాత్రలో కనిపించిన ఆయన.. రానున్న తరాలకు కూడా కర్ణుడు అంటే ఇతనే అనే ఆరాను క్రియేట్ చేయగలిగాడు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు పంకజ్ ధీర్(63) మృతి సినీ ఇండస్ట్రీని దు:ఖసాగరంలో ముంచెత్తింది. ముఖ్యంగా మహాభారతం టీవీ సీరియల్‌లో ఐకానిక్ కర్ణ పాత్రలో కనిపించిన ఆయన.. రానున్న తరాలకు కూడా కర్ణుడు అంటే ఇతనే అనే ఆరాను క్రియేట్ చేయగలిగాడు. దాదాపు 40కిపైగా సినిమాల్లో నటించిన ఆయన.. సీరియల్స్ ద్వారా ప్రతీ ఇంట్లో ఒక్కడయ్యాడు. ‘అభినయ్’ పేరుతో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించి.. అస్పైరింగ్ యాక్టర్స్‌కు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు.
అయితే చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పంకజ్ ధీర్.. ఈ ఏడాది ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్నాడు. కానీ కొద్ది నెలల క్రితం నుంచి మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలోనే ఆయన మరణించారు. కాగా ఆయన అంత్యక్రియలకు తన ఆప్తుడు సల్మాన్ ఖాన్‌తోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా, అర్బాజ్ ఖాన్ వంటి నటులు పెద్దమొత్తంలో హాజరయ్యారు. ఆయనకు తుది వీడ్కోలు పలికారు.






