Salman Khan: సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. ఎందుకంటే?

by Ramesh Naini |   (  Updated:2025-10-26 12:34:04  IST  )

ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇటీవల సౌదీలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ ఫోరం-2025’లో సల్మాన్ చేసిన వ్యాఖ్యల కారణంగా పాక్ ప్రభుత్వం ఆయనను ఉగ్రవాద నిరోధక చట్టం (1997) లోని 4 షెడ్యూల్‌లో చేర్చింది. ఈ షెడ్యూల్‌లో ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల జాబితా ఉంటుంది.

కొద్ది రోజుల క్రితం జాయ్ ఫోరంలో సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలపై వ్యాఖ్యలు చేస్తూ బలూచిస్తాన్‌ను ప్రత్యేక ప్రాంతంగా పేర్కొన్నారు. తమిళ, తెలుగు, మలయాళ సినిమాలు కూడా వందల కోట్ల వ్యాపారం చేస్తాయని, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాక్ ప్రజలు ఇక్కడ పని చేస్తున్నారని సల్మాన్ అన్నారు. పాకిస్తాన్, బలూచిస్తాన్‌ను వేర్వేరుగా ప్రస్తావించడం పాక్‌‌లో భగ్గుమంది.

ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో వైరల్‌గా మారడంతో తీవ్ర కలకలం రేపింది. దీంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌పై అధికారిక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదిగా ముద్రవేస్తూ యాంటీ టెర్రరిజం యాక్ట్‌లోని 4వ షెడ్యూల్‌లో (టెర్రర్ లింక్స్ బ్లాక్ లిస్ట్) ఆయన పేరు చేర్చినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. కాగా, బలూచిస్తాన్‌ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్‌ వేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల కోసం క్లిక్ చేయండి..

Next Story