- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ నటుడు అజిత్‌కు పద్మభూషణ్.. మరో నటికి కూడా..
కేంద్ర ప్రభుత్వం(Central Govt) శనివారం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ, సేవా రంగాల్లో ప్రముఖులు చేసిన సేవలను గుర్తించి అవార్డులు అనౌన్స్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) శనివారం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ, సేవా రంగాల్లో ప్రముఖులు చేసిన సేవలను గుర్తించి అవార్డులు అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే సినీ రంగం(Film Industry)లో చేసిన సేవలను తమిళ నటుడు అజిత్(Ajith)కు, నటి శోభన(Actress Shobana)కు, నందమూరి బాలకృష్ణలకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అంతేకాదు.. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను ప్రకటించింది.
దేశంలోనే కాకుండా విదేశాల్లో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడా, కళా, వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలందించిన ప్రముఖులను కేంద్రం ఎంపిక చేయగా.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని.. పద్మశ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులకు ఎంపిక చేసింది. అందుకు సంబంధించిన జాబితాలను కేంద్రం విడుదల చేసింది.






