- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మభూషణ్ అందుకోనున్న బాలకృష్ణ
దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రధానోత్సవం ఇవాళ జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రధానోత్సవం ఇవాళ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికగా ఆ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) ప్రదానం చేయనున్నారు. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) పద్మ భూషణ్ అవార్డును ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) దంపతులు కాసేపట్లో ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు.
కాగా, 2025 సంవత్సరానికి పద్మ అవార్డుల జాబితాలో మొత్తం 139 మంది గ్రహీతలను ప్రకటించారు. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. పద్మ విభూషణ్ (Padma Vibhushan) అందుకోనున్న ప్రముఖుల్లో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, జస్టిస్ (రిటైర్డ్) శ్రీ జగదీష్ సింగ్ ఖేహర్, కుముదిని రజనీకాంత్ లఖియా, లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం, ఒసాము సుజుకి (మరణానంతరం) ఉన్నారు. ఇక పద్మ భూషణ్ (Padma Bhushan) గ్రహీతల్లో పీఆర్ శ్రీజేష్, రవిచంద్రన్ అశ్విన్, ఐఎం విజయన్, హర్విందర్ సింగ్, సత్యపాల్, అజిత్ కుమార్చ, శోభనా చంద్రకుమార్ ఉన్నారు. అదేవిధంగా పద్మశ్రీ (Padma Sri) పురస్కారం అందుకోనున్న ప్రముఖుల్లో అరిజిత్ సింగ్, విలాస్ దాంగ్రే, వెంకప్ప అంబానీ సుగటేకర్, నిర్మలా దేవి, లిబియా లోబో లాంటి ప్రముఖులు ఉన్నారు.






