‘జాక్’ నుంచి ‘పాబ్లో నెరుడా’ వచ్చేసింది.. జానీ మాస్టర్ స్టెప్పులతో అదరగొట్టిన సిద్ధు

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 05:35:37  IST  )

బొమ్మరిల్లు భాస్కర్ (Director Bommarillu Bhaskar) దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’ (Jack Konchem Crack).

‘జాక్’ నుంచి ‘పాబ్లో నెరుడా’ వచ్చేసింది.. జానీ మాస్టర్ స్టెప్పులతో అదరగొట్టిన సిద్ధు
X

దిశ, సినిమా: బొమ్మరిల్లు భాస్కర్ (Director Bommarillu Bhaskar) దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’ (Jack Konchem Crack). ఇందులో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన టీజర్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా ఏదో కొత్త పాయింట్‌ను చెప్పబోతోన్నారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘పాబ్లో నెరుడా’ అంటూ హుషారుగా సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను వనమాలి రచించారు. అచ్చు రాజమణి బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక జానీ మాస్టర్ (Johnny Master) కొరియోగ్రఫీ మరింత అట్రాక్షన్‌గా నిలిచింది. సిద్దు నుంచి ఎనర్జిటిక్ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసి అతని అభిమానుల్ని ఆకట్టుకుందని చెప్పొచ్చు. హీరో పరిచయం గీతంతో అంచనాల్ని మరింతగా పెంచేసినట్టు అయింది.

Next Story