P. Vasu:రజినీకాంత్‌ని కొట్టడం ఇష్టం లేక ఆమె సినిమాని రిజెక్ట్ చేసింది

by Pulgam srinivas |

రజనీకాంత్‌ను కొట్టే సీన్ వల్ల హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేసిన కుష్బూ

P. Vasu:రజినీకాంత్‌ని కొట్టడం ఇష్టం లేక ఆమె సినిమాని రిజెక్ట్ చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విజయశాంతి, ఖుష్బూ హీరోయిన్లుగా, పి. వాసు దర్శకత్వంలో 1992లో విడుదలైన మన్నన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ దర్శకుడు పి. వాసు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వాసు మాట్లాడుతూ… ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జోడిగా మొదట ఖుష్బూను అనుకున్నానని తెలిపారు. అందులో భాగంగా ఆమెకు కథను కూడా వినిపించానని చెప్పారు.

స్టోరీ మొత్తం ఆమెకు బాగా నచ్చిందని, అయితే ఒక ముఖ్యమైన సన్నివేశం విషయంలో మాత్రం ఆమె కంఫర్ట్‌గా ఫీల్ కాలేదని వివరించారు. ఆ సన్నివేశంలో ఖుష్బూ, రజనీకాంత్ చెంపపై కొట్టే సీన్ ఉంటుందని, అయితే రజనీకాంత్ గారు గొప్ప స్టార్ హీరో అని, ఆయనను చెంపపై కొడితే అభిమానులు ఒప్పుకోరని, థియేటర్లలో స్క్రీన్‌లు చించేసే పరిస్థితి రావచ్చని ఖుష్బూ భావించిందని చెప్పారు. అలాగే ఆయనపై తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనను చెంపపై కొట్టే సన్నివేశం చేయలేనని, అంతకన్నా సినిమా చేయకపోవడమే మంచిదని ఆమె చెప్పిందని వాసు తెలిపారు.

దాంతో ఆమె నిర్ణయానికి గౌరవం ఇచ్చి, ఆ తర్వాత ఆ పాత్రలో విజయశాంతిని తీసుకున్నామని, అ తర్వాత సినిమాలో హీరోయిన్ పాత్ర కాకపోయినా, వేరే పాత్ర ఉంటే ఇవ్వాలని ఖుష్బూ స్వయంగా కోరిందని, దాంతో సినిమాలో హీరోయిన్ (పి.ఏ) పాత్ర ఉండటంతో అందులో ఆమెను తీసుకున్నామని వెల్లడించారు. ఇక ఖుష్బూ గురించి మాట్లాడుతూ… ఆమె చాలా మంచిదని, స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈగో అసలు ఉండదని, తనకు నచ్చితే ఏ పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చే గొప్ప నటి అని ఆమెను ఈ దర్శకుడు ప్రశంసించారు.

Next Story