మాది లవ్ హేట్ రిలేషన్ షిప్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ మాటలకు ఎమోషనల్ అయిన రష్మిక మందన్న(వీడియో)

by Gugulothu.Kavitha |

‘ఛలో’(Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మాది లవ్ హేట్ రిలేషన్ షిప్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ మాటలకు ఎమోషనల్ అయిన రష్మిక మందన్న(వీడియో)
X

దిశ, సినిమా: ‘ఛలో’(Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక పుష్ప(Pushpa) సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి అక్కడ కూడా స్టార్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘పుష్ప2’(Pushpa2) మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన సినిమా అప్డేట్స్, లేటెస్ట్ ఫొటోలు వంటివి షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ అయిన ప్రేరణ.. రష్మిక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళిద్దరు రూమ్ మేట్స్. మోడలింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి అవకాశాల కోసం వెళ్లేవారు. ఇద్దరూ ఒకే రూంలో ఉండేవారు. అయితే రష్మిక తన కెరీర్ తొలినాళ్లలో ఓ టీవీ షోకు గెస్టుగా వెళ్లింది. అక్కడికి ప్రేరణ సైతం వచ్చింది. ఆ సమయంలో రష్మిక గురించి ప్రేరణ మాట్లాడుతూ.. 'మాది లవ్ హేట్ రిలేషన్ షిప్.. నిజానికి ప్రేమ, ద్వేషం రెండూ ఒకే చోట ఉండలేవు. కానీ నిజం చెప్పాలంటే రష్మిక ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ అయిపోయింది' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేరణ మాటలకు రష్మిక ఎమోషనల్ అయిపోయింది. వెంటనే రష్మిక వెళ్లి ప్రేరణకు హగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story