మా ప్రయాణం మొదలైంది.. అతనితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన మెగా బ్యూటీ

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ (Krishna Gaadi Veera Prema Gaadha)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

మా ప్రయాణం మొదలైంది.. అతనితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన మెగా బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ (Krishna Gaadi Veera Prema Gaadha)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఈ భామ సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), వరుణ్ తేజ్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), గోపీచంద్, కళ్యాణ్ రామ్ వంటి వారితో నటించింది. ఇక చివరగా మెహ్రీన్ ‘స్పార్క్’ సినిమాలో కనిపించింది. గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా, మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘సెగల్ ఈ పెయింటింగ్ వేశారు. దీంతో మా ప్రయాణం మొదలైంది. మమ్మల్ని ఆకృతి చేసిన క్షణాల నుండి పుట్టింది. ప్రతి బ్రష్‌స్ట్రోక్ ఒక కథను చెబుతుంది. మనం ఇక్కడికి ఎలా చేరుకున్నాము. ఈ మాయా నగరానికి అనేది తెలియజేస్తోంది. ప్రతి మలుపు, ప్రతి నిశ్శబ్ద విజయం మనం కలలుగన్న జీవితానికి దగ్గర చేసింది. ఇది కేవలం కళ కాదు-ఇది మనం. అది మనం జీవించిన, ప్రేమించిన, కలిసి ఉన్న ప్రతి దాన్ని ఎప్పటికీ కలిగి ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ఇద్దరు ఒకే కలర్ దుస్తులు ధరించిన ఫొటోలను షేర్ చేసింది. ఇక అది చూసిన వారంతా వావ్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అతను ఎవరో తెలియక రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story