మా ప్రయాణం ప్రారంభమవుతుంది.. ఉత్సాహంగా ఉందంటూ ‘BRB’ అప్డేట్ ఇచ్చిన కిచ్చా సుదీప్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హీరోగానే కాకుండా విలన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

మా ప్రయాణం ప్రారంభమవుతుంది.. ఉత్సాహంగా ఉందంటూ ‘BRB’ అప్డేట్ ఇచ్చిన కిచ్చా సుదీప్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హీరోగానే కాకుండా విలన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona) సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. మళ్లీ గత ఏడాది ‘మ్యాక్స్’(Max) పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను విజయ్ కార్తికేయ తెరకెక్కించారు. అయితే డిసెంబర్‌లో థియేటర్స్‌లోకి వచ్చి హిట్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కిచ్చా సుదీప్ ‘బీఆర్‌బి: ఫస్ట్ బ్లడ్’(BRB: First Blood) (బిల్లా రంగా భాషా) చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

దీనిని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ విడుదలై చాలా నెలలు గడుస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. తాజాగా, కిచ్చా సుదీప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘బీఆర్‌బి’ సినిమాకు సంబంధించిన షూట్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఇక ఇందులో ఆయన గుబురు గడ్డంతో కోపంగా చూస్తూ కనిపించారు. ఈ పోస్ట్‌కు ‘‘మా ప్రయాయణం ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మా బృందానికి నేలపైకి వెళ్లడం ఒక అసమానమైన ఉత్సాహంను కలిగిస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Next Story