- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు క్రేజీ సినిమాలు
తాజాగా విష్ణు విన్యాసం, బోర్డర్ 2 చిత్రాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలోకి పెద్ద ఎత్తున సినిమాలు వస్తుంటాయి. అందులో భాగంగా ఈ వారం కూడా రెండు క్రేజీ సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనే వివరాలను తెలుసుకుందాం.
విష్ణు విన్యాసం
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది, కానీ భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం మార్చి 20, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
బోర్డర్ 2
సన్నీ డియోల్, వరుణ్ దావన్, దిల్‌జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రోజు నుండి ఈ సంస్థ వారు ఈ చిత్రాన్ని తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.






