- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే
అక్టోబర్ 17వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందపురి సినిమా

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి పండుగ వస్తోంది. వచ్చేవారమే రానున్న దీపావళి పండుగ, దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల సందడి కూడా మొదలైంది. థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటే, ఓటీటీలో కూడా తెలుగు సినిమాలు వస్తున్నాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. దీపావళి కానుకగా ఇప్పటికే తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మొన్న అక్టోబర్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇక ఈ వారం అక్టోబర్ 17వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందపురి సినిమా ( Kishkindhapuri ) రిలీజ్ కానుంది. ఈ మూవీ జి5 లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే భగవత్ సిరీస్ కూడా అక్టోబర్ 17వ తేదీన జి5 లో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 17వ తేదీన ఆహాలో ఆనందలహరి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో పరమ్ సుందరి వస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 17వ తేదీ నుంచి గుడ్ న్యూస్ స్ట్రీమింగ్ అవుతుంది. ది డిప్లొమాట్ సీజన్ 3 సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేటర్లలో వచ్చే వారం రోజుల్లో మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మిత్ర మండలి సినిమా ఈనెల 16వ తేదీన రిలీజ్ కానుండగా, తెలుసు కదా 17వ తేదీన వస్తోంది. అదే రోజున ప్రదీప్ రంగనాథన్ చేసిన డ్యూడ్ కూడా రిలీజ్ అవుతుంది. మరోసారి దీపావళి కానుకగా కే ర్యాంప్ సినిమాతో అక్టోబర్ 18 వ తేదీన కిరణబ్బవరం వస్తున్నాడు.






