- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు: ‘సిన్నర్స్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాల జోరు
లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘సినర్స్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాలు సత్తా చాటాయి.

దిశ, వెబ్‌డెస్క్: మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్న ఆస్కార్ (Oscar) అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందుకు లాస్ ఏంజెలెస్ (Los Angeles)లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ బిగ్ ఈవెంట్‌లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలు దుమ్ములేపుతున్నాయి. అత్యధిక నామినేషన్లు ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘Sinners’ సినిమా రికార్డు స్థాయిలో 16 నామినేషన్లతో పోటీలో నిలిచింది. ప్రధాన పోటీ మాత్రం ‘One Battle After Another’, ‘Sinners’ సినిమాల మధ్యే నెలకొంది.
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)
ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కేపాప్ డిమాన్ హంటర్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టైయిన్
ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఉత్తమ సౌండ్: ఎఫ్-1
ఉత్తమ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్






