అక్షయ్ కుమార్‌తోనే OMG-3... క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-13 15:45:15  IST  )

అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ (OMG) మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది.

అక్షయ్ కుమార్‌తోనే OMG-3... క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ (OMG) మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీని అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నిర్మించారు. ఇక 2023లో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ (OMG-2) తెరెక్కించాడు డైరెక్టర్ అమిత్ రాయ్. ఇది కూడా హిట్ అందుకోవడంతో.. ఇప్పుడు అందరి చూపు OMG-3పై పడింది.

ఓమైగాడ్ ఫ్రాంచైజీలో OMG-3 కూడా రాబోతున్నట్లు పలు సోషల్ మీడియాలో వార్తలు రాగా.. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ రాయ్.. ఓమైగాడ్-3పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశాము. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. అయితే.. ఈసారి కూడా ఓ మై గాడ్-3 కి నిర్మాతగా ఉన్న అక్షయ్ కుమార్.. కచ్చితంగా ఇందులో నటిస్తారు’ అని తెలిపాడు.

Next Story