- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్భుతమైన సెట్‌లో ‘ఓం వీర నాగ్’ షూట్..
యంగ్ హీరో విరాట్ కర్ణ, డైరెక్టర్ అభిషేక్ నామా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘నాగబంధం’.

దిశ, సినిమా: యంగ్ హీరో విరాట్ కర్ణ, డైరెక్టర్ అభిషేక్ నామా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అద్భుతమైన శివాలయం సెట్‌లో గణేశ్ ఆచార్య మాస్టర్ కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై 'ఓం వీర నాగ' సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ డివోషనల్ సాంగ్.. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయ సెట్‌లో షూట్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించింది. కాగా.. ‘నాగబంధం’లో విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్‌తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ఇక భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగే ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో ప్రారంభం కానున్నాయి.






