‘మాస్ జాతర’ నుంచి ఓలే ఓలే సాంగ్ ప్రోమో అవుట్.. కిర్రాక్ స్టెప్పులతో అదరగొట్టిన హీరో, హీరోయిన్..

by I. Sairam |

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara).

‘మాస్ జాతర’ నుంచి ఓలే ఓలే సాంగ్ ప్రోమో అవుట్.. కిర్రాక్ స్టెప్పులతో అదరగొట్టిన హీరో, హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara). ఇక దీన్ని దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) భారీగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ అవైటెడ్ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటూ పోయింది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ఓలే ఓలే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, శ్రీలీల మాసు స్టెప్పులతో అదరగొట్టేశారు. కాగా ఈ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 4గంటల 6 నిమిషాలకు విడుదల కానుంది. కాగా ఈ మూవీ ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Link

Next Story