హిమాలయాలంత స్వచ్ఛమైన సినిమా ‘ఓహ్’

by Sujitha Rachapalli |

జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిల్మ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘ఓహ్’. ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

హిమాలయాలంత స్వచ్ఛమైన  సినిమా ‘ఓహ్’
X

దిశ, సినిమా : జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిల్మ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘ఓహ్’. ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్, వరంగల్‌లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్దమైంది.

ఈ సందర్బంగా మాట్లాడిన మేకర్స్.. ‘ఓహ్’ మూవీని అద్భుతమైన క్వాలిటీ‌తో ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు. క్రోమో ఫోబియాను పాయింట్‌గా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంత వరకు రానటువంటి అందమైన ప్రేమ కావ్యంతో ఈ చిత్రం వస్తుందన్నాడు హీరో రఘు రామ్. తన మొదటి చిత్రం కథ కోసం ఎంతో రీసెర్చ్ చేసి ఈ అద్భుతమైన కథ కథనం మాటలు రాశానని.. మీ అందరిచే ఓహ్ ఓహ్ అనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సాక్షాత్ ఆ పరమశివుడు కొలువై ఉన్న హిమాలయాలు అంతా స్వచ్ఛమైనది ఈ చిత్రమని తెలిపాడు.

Next Story