పవన్ మేనియా.. OG సినిమా టికెట్ అక్షరాలా రూ.లక్ష

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా(OG Movie) ఇంకో ఐదు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

పవన్ మేనియా.. OG సినిమా టికెట్ అక్షరాలా రూ.లక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా(OG Movie) ఇంకో ఐదు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రీమియర్ షో(Premiere Show) మొదటి టికెట్ వేలం పేరుతో ఈ మధ్య ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో బుక్సింగ్స్ ఓపెన్ చేయగా, అక్కడ టికెట్స్ వేలం ముగిసింది. ఒక్కో దేశంలో, ఒక్కో టికెట్‌ను లక్షల్లో పెట్టి కొన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో ఇక్కడా వేలం మొదలెట్టారు. తాజాగా నిర్వహించిన ఓ వేలంలో ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను అక్షరాలా రూ.లక్ష పెట్టి కొన్నారు. అంతేకాదు.. అక్కడిక్కడే లక్ష రూపాయల చెక్కు కూడా రాసిచ్చారు. ప్రస్తుతం ఈ చెక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంచారు. స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ ఉండ‌నున్నాయి. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైన‌ల్ చేశారు. ట్వీట్

Next Story