OG OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఓజీ సినిమా..ఎందులో స్ట్రీమింగ్ అంటే !

by velandi.Saikiran |   (  Updated:2025-10-14 06:38:32  IST  )

OG movie అక్టోబర్ 23వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఓజీ సినిమా

OG OTT:  ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఓజీ సినిమా..ఎందులో స్ట్రీమింగ్ అంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ మూవీ వచ్చింది. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఓజీ సినిమా. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూపించారు దర్శకుడు సుజిత్.

ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అరుళ్ మోహన్ న‌టించారు. అంతేకాదు ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ బాగా కనెక్ట్ అయింది. ఇక‌ ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఓజీ సినిమా అక్టోబర్ 23వ తేదీ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. దీంతో థియేటర్ లో చూడని వారు ఇప్పుడు ఓటీటీలో కూడా చూసుకోవచ్చు.

READ MORE ......

ధృవ్ విక్రమ్ ‘బైసన్’ ట్రైలర్ విడుదల.. బ్లాక్ బస్టర్ సంభవం అంటూ నెటిజన్ల కామెంట్స్

Next Story