అఫీషియల్ : రవితేజ ఇరుముడి విడుదల తేదీ ఫిక్స్

by Pulgam srinivas |

రవితేజ హీరోగా రూపొందుతున్న ‘ఇరుముడి’ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అఫీషియల్ : రవితేజ ఇరుముడి విడుదల తేదీ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. భక్తి భావోద్వేగాల నేపథ్యంతో సాగే హృద్యమైన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రవితేజ ప్రేమాభిమానాలు కలిగిన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషనల్ కంటెంట్‌తో సినిమా ఉండబోతుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. వరుస అపజయాల తర్వాత రవితేజకు ఈ చిత్రం కీలకంగా మారింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.




Next Story