అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా OG రికార్డ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-06 11:36:26  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) కలెక్షన్లపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా OG రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) కలెక్షన్లపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 11 రోజుల్లో రూ.308 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొంది. 2025లో అత్యంత వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలించిందని వెల్లడించింది. ‘‘నో రూల్స్.. నో లా.. ఓన్లీ గంభీరా’’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. ఇందులో పవన్ స్టైలిష్ లుక్‌లో బైక్‌పై కూర్చున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. భారీ అంచనాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. 11 రోజుల్లో కలిసి రూ.308 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు.

Next Story