Odela2 : "ఓదెల 2" ట్రైలర్ పై క్రేజీ అప్డేట్

by velandi.Saikiran |   (  Updated:2025-04-06 12:37:03  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ( Tamannaah Bhatia) కీలక పాత్ర చేసిన సినిమా ఓదెల 2 ( Odela 2). ఈ సినిమా రిలీజ్

Odela2 : ఓదెల 2 ట్రైలర్ పై క్రేజీ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ( Tamannaah Bhatia) కీలక పాత్ర చేసిన సినిమా ఓదెల 2 ( Odela 2). ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఓదెల 2 ( Odela 2) సినిమా నుంచి రోజుకు అప్డేట్ వదులుతోంది చిత్ర బృందం. అయితే తాజాగా ఓదెల 2 సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ( Odela 2 Trailer ) లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 8వ తేదీ అంటే మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓదెల 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది చిత్ర బృందం.

ముంబైలోని ( Mumbai ) బాంద్రా వెస్ట్ సమీపంలో ఉన్న గెలాక్సీ థియేటర్ లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరగనుందని వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ కు హీరోయిన్ తమన్నాతో పాటు చిత్ర బృంద సభ్యులు కూడా హాజరు కాబోతున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్ర లో కనిపిస్తున్న ఓదెల 2 సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట ఎం సింహ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఓదెల మొదటి భాగం సక్సెస్ కావడంతో... పార్ట్ 2 చేస్తున్నారు. ఇక ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Next Story