Odela-2: మహా కుంభమేళాలో ఆ సినిమా టీజర్ లాంచ్.. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న పోస్టర్

by Chukka Sudharani |

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) త్వరలో ‘ఓదెల-2’ (Odela-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Odela-2: మహా కుంభమేళాలో ఆ సినిమా టీజర్ లాంచ్.. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) త్వరలో ‘ఓదెల-2’ (Odela-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది వర్క్స్‌పై డి మధు నిర్మిస్తున్నారు. ఇందులో తమన్న మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా.. హెబ్బా పటేల్ (Hebba Patel), మురళీ శర్మ (Murali Sharma) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘ఓదెల-2’ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ హైప్ పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా టీజర్ (Teaser) విడుదల డేట్ ఫిక్స్ చేస్తూ.. ‘మహా కుంభమేళాలో తొలిసారిగా టీజర్ లాంచ్ జరగబోతుంది.. శివ అండ్ శక్తి ఆశీస్సులతో, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగే దివ్య వాతావరణంలో ఓదెల-2 టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ టీజర్ ఫిబ్రవరి 22న రాబోతుంది. త్వరలో ఈ సినమా దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Next Story