- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jeeva46: జీవకు జతగా ఎంపురాన్ బ్యూటీ.. నెట్టింట ట్వీట్స్ వైరల్
ఈ ఏడాది ‘అఘాతియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు హీరో జీవ.

దిశ, సినిమా: ఈ ఏడాది ‘అఘాతియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు హీరో జీవ. ఇప్పుడు ఆయన తన 46 మూవీకి సిద్ధం అవుతున్నాడు. గతేడాది ‘బ్లాక్’ మూవీతో ఆడియన్స్‌ను భయపెట్టిన ఈ హీరో.. ఇప్పుడు మరోసారి ఆ డైరెక్టర్‌తో చేతులు కలిపాడు. హారర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన బ్లాక్ చిత్రానికి కేజీ బాలసుబ్రమణి దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జీవ 46తో వీరిద్దరు మరోసారి జతకట్టారు. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు జీవ. ఈ మేరకు ‘కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది. నా జీవ46ను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయడంతో ఎంతో సంతోషంగా ఉన్నాను.
మరోసారి డైరెక్టర్ కేజీ బాలసుబ్రమణితో జతకట్టడం చాలా ఉత్సాహంగా ఉంది. ఈసారి కొత్త స్క్రిప్ట్‌తో పాటు మరింత ఎంజాయ్‌మెంట్‌తో మీ ముందుకు రాబోతున్నాము. దీనికి మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ ఉండాలి’ అని తెలిపారు. అయితే.. ఇందులో ‘L2: ఎంపురాన్’ ఫేమ్ బ్యూటీ నైలా ఉష హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లింక్






