- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridevi Drama Company: క్లోజ్ గా ఉండే నూకరాజు, పంచ్ ప్రసాద్ స్టేజిపైనే ఫైట్ .. ఏకంగా లైట్స్ ఆఫ్ చేసి మరి గొడవ పడ్డారు? ( వీడియో )
నూకరాజు ఈ విషయాన్ని మాట్లాడటానికి అస్సలు ఒప్పుకోలేదు.

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర పాపులర్ షోలలో " శ్రీదేవి డ్రామా కంపెనీ " ( Sridevi Drama Company ) కూడా ఒకటి. ఈ షోలో ప్రతి వారం ఏదోక డ్రామా నడుస్తూనే ఉంటుంది. అలాగే, స్టేజ్‌పై ఎన్నో సార్లు గొడవలు పడటం, ఆ తర్వాత అదంతా అబద్దం అని తేలిపోవడం చూశాము. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో క్లోజ్ గా ఉండే పంచ్ ప్రసాద్, నూకరాజు ఇద్దరూ గొడవ పడటం అందర్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అసలు ఆ ప్రోమోలో ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రోమోలో పంచ్ ప్రసాద్ ( punch prasad ) మాట్లాడుతూ.. "నాకు నూకరాజు ( Nukaraju ) బ్రదర్ కంటే చాలా ఎక్కువ. కానీ, వాడు నాతో మాట్లాడట్లేదు ఎందుకు అనేది నాకు తెలియాలి" అని అన్నాడు. దీంతో నూకరాజు స్టేజ్ పైకి వచ్చి " ఒక మనిషికి కావాలని దూరం కాము. కారణం ఉంటేనే అవుతాము కదా .. అదేంటో నాకు తెలుసు" అని అన్నాడు. ఆ మాటకి ప్రసాద్ కి చాలా కోపం వస్తుంది.. "తెలిస్తే నీలో ఎందుకు దాచుకోవడం.. నాకు కూడా చెప్పొచ్చు కదా" అని అడిగాడు. " మనం దీని గురించి ఇంతక ముందే డిస్కస్ చేశాము. ఇక్కడ డిస్కస్ చేసేది కాదు" అంటూ నూకరాజు ఈ విషయాన్ని మాట్లాడటానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వీరిద్దరి పెద్ద వారే జరిగినట్టుగా ఉంది. ఇద్దర్ని కూల్ చేయాలనుకున్నారు, కానీ , లైట్స్ ఆఫ్ చేసి మరి గొడవ పడ్డారు. అసలు వీరిద్దరూ నిజంగానే గొడవ పడ్డారా .. లేక ప్రాంకా? అనేది తెలియాలంటే జనవరి 26 వరకు వెయిట్ చేయాల్సి ఉంది.






